మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ కొల్చారం మండలంలో పలు గ్రామాల్లో డిఆర్డిఓ శ్రీనివాసరావు శుక్రవారం పర్యటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. పండ్ల తోటల పెంపకానికి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా రైతులకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తుందన్నారు. జిల్లావ్యాప్తంగా 1000 ఎకరాల విస్తీర్ణంలో పండ్లు తోటలు సాగు చేసేందుకు అవకాశం ఉందని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.