మెదక్ జిల్లా నర్సాపూర్ పురపాలక సంఘం కార్యాలయంలో పురపాలక సంఘం చైర్మన్ దుర్గప్ప అశోక్ గౌడ్ అధ్యక్షతన కౌన్సిల్ సాధారణ సమావేశం సోమవారం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా స్థానిక శాసన సభ్యురాలు వాకిటి సునీత లక్ష్మారెడ్డి హాజరయ్యారు. ఈ సమావేశంలో వివిధ అభివృద్ధి పనులు, మంచినీటి సరఫరా, వీధి దీపాల, ఇతర అంశాలపై చర్చించి సమావేశం నిర్వహించారు.