మెదక్ జిల్లా చిలిపి చిలిపి చెడు మండలం చిట్కుల్ గ్రామం లో సోమవారం ఉదయం నుంచి వర్షం కురుస్తుంది. భారీ స్థాయిలో వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కాలనీలో రహదారులన్నీ బురదమయంగా మారాయి. ఉదయం సమయంలో పాఠశాలకు వెళ్లే
విద్యార్థులు వర్షంతో కొంత ఇబ్బంది పడ్డారు. రెండు రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.