తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ. రక్షకులకే రక్షణ కరువైన పరిస్థితులు తెలంగాణలో ఉన్నాయన్నారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత మన దేశంలో పోలీసులే నిరసన చేపట్టడం ఇదే మొదటిసారి అన్నారు. రాష్ట్రంలో ప్రజాపాలన ఉందా అనే అనుమానం కలుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, తదితరులు పాల్గొన్నారు.