మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం శివంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఛైర్మన్ వెంకట్రామిరెడ్డి శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు రైతులకు ఇచ్చిన హామీ మేరకు సన్న ధాన్యానికి రూ. 500 బోనస్ అందజేస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు కొనుగోలు చేసిన ధాన్యానికి డబ్బులు కూడా చెల్లిస్తున్నామని తెలిపారు.