మొహరం (పీర్ల) పండుగను పురస్కరించుకొని మెదక్ జిల్లా చిలిపి చెడు మండలం చిట్కుల్ గ్రామం లో శనివారం పెద్ద ఎత్తున ఉరేగింపులు నిర్వహించనున్నారు. ఓహో జంబియా, ఒలంపల్లి జంబియా అంటూ బస్తీలు, గ్రామాల్లో పీర్ల ఊరేగింపు చేస్తూ సందడి చేయనున్నారు. హిందూ, ముస్లిం సోదరభావానికి ప్రతీకగా నిలిచే పీర్ల పండగను పెద్ద ఎత్తున నిర్వహించనుండడంతో ఆయా ప్రాంతాల్లో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.