మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం కొల్చారం మండలం రంగంపేట ఆశ్రమ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ మాధవానంద సరస్వతి స్వామి ఆదివారం నుంచి చాతుర్మాస్య దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా చాతుర్మాస్య దీక్షలు సెప్టెంబర్ 18 వరకు కొనసాగించనున్నారు. ఈరోజు నుంచి పలు జీవరాశులు భూమి నుంచి జన్మించి మనుగడ సాగించనున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.