కేతకి సంగమేశ్వర స్వామి సమేత సాయిబాబా దేవాలయంలో మార్గశిర మాస ఆరుద్ర నక్షత్రం సందర్భంగా సంగమేశ్వర స్వామికి పంచామృత మరియు సుగంధ ద్రవ్యాలతో అభిషేకం, షోడశోపచార పూజ శివ పంతులు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. అనంతరం తీర్థ ప్రసాద వితరణ జరిగింది. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు భక్తులు పాల్గొన్నారు.