టేక్మాల్ మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో టేక్మాల్, ఎల్లంపల్లి, ధన్నూర, చంద్రుతండాలలో సంఘం సభ్యులు, మండల కాంగ్రెస్ నేతలు వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలలో మాత్రమే రైతులు ధాన్యం అమ్ముకొని మద్దతు ధర పొందాలన్నారు. అలాగే సన్న రకం వరి ధాన్యంకు రూ.500 బోనస్‌ను కూడా పొందాలని వారు రైతులను కోరారు.