చికిత్స పొందుతూ యువకుడి మృతి
చిన్నశంకరంపేటకు చెందిన వికాస్ కుమార్(23) డిగ్రీ పూర్తి చేసుకొని ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తూ ప్రభుత్వ ఉద్యోగానికి సన్నద్ధమవుతున్నాడు. వారం రోజుల క్రితం జ్వరం రాగా కుటుంబసభ్యులు మెదక్, చేగుంటలోని ప్రైవేట్ ఆసుపత్రులకు తీసుకెళ్ళారు. వైద్యుల సూచనల మేరకు సికింద్రాబాద్లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వికాస్ కుమార్ మృతి చెందాడు.