తూప్రాన్ రెసిడెన్షియల్ స్కూల్లో దారుణం
మెదక్ జిల్లా తూప్రాన్ రెసిడెన్షియల్ స్కూల్లో దారుణం చోటుచేసుకుంది. చిన్న విషయంలో విద్యార్థుల మధ్య గొడవ జరగడంతో 9వ తరగతి విద్యార్థులను పదో తరగతి విద్యార్థులు అర్థరాత్రి చితకబాదారు. నోట్లో గుడ్డలు కుక్కి విచక్షణారహితంగా కొట్టారు. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు వెళ్లి యాజమాన్యంతో వాగ్వాదానికి దిగారు. ప్రిన్సిపల్ స్పందిస్తూ దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.