తాను ఎలాంటి భూమిని కబ్జా చేయలేదని BRS మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి విమర్శించారు. 114 ఎకరాల సామ దామోదర్ రెడ్డి భూమి వ్యవహారంలో విచారణ ఎదుర్కొంటున్న ఆయన.. పోలీసులు మళ్లీ పిలిస్తే తప్పకుండా విచారణకు హాజరు అవుతానని చెప్పారు. సుప్రీం కోర్టు ఇచ్చిన ఆర్డర్ కాపీని PSలో ఇచ్చానని తెలిపారు. తనపై వేసిన కేసు కొట్టివేయాలంటూ వేసిన పిటిషన్‌ను హైకోర్టు డిస్మిస్ చేయడంతో.. ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.