విద్యార్థినుల అస్వస్థతకు కారకులపై చర్యలకు డిమాండ్
న్యాల్కల్ కేజీబీవీలో విద్యార్థినుల అస్వస్థతకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు సాయి బాషా డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినులను ఆదివారం పరామర్శించారు. ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండ్ డాక్టర్ అనిల్ కుమార్ తో మాట్లాడి వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థినులకు పండ్లను పంపిణీ చేశారు.