నారాయణపేట జిల్లా కేంద్రంలోని మెడికల్ కళాశాల ప్రారంభోత్సవంలో భాగంగా మెడికల్ విద్యార్థులకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పలు సూచనలు చేశారు. నారాయణపేట అభివృద్ధి కోసం దివంగత మాజీ ఎమ్మెల్యే చిట్టెం నర్సిరెడ్డి ఎంతో కృషి చేశారని, ఆయన పేరు చిరస్థాయిగా నిలిచేలా మెడికల్ కళాశాలకు 'చిట్టెం నర్సిరెడ్డి కళాశాల' అనే పేరు పెట్టనున్నట్లు తెలిపారు. ఈ విషయంపై అధికారులతో చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని సీఎం పేర్కొన్నారు.