ప్రాణాలను కాపాడే పీజీ వైద్య విద్యార్థులు కనీస వసతులు, సౌకర్యాలు లేక.. దుర్భర పరిస్థితుల్లో బిక్కుబిక్కుమంటూ వైద్యవిద్యను అభ్యసిస్తున్నారు. జాతీయ వైద్య మండలి (ఎన్‌ఎంసీ) నిబంధనలు కాగితాలకే పరిమితం కావడంతో పలు వైద్య కళాశాలల్లో పీజీ విద్యార్థులు ఆందోళనకర పరిస్థితుల్లో విధులను నిర్వహిస్తున్నారు. చాలామేర ప్రైవేటు కళాశాలల్లో స్టైఫండ్ పేరుకే తప్ప చేతికి ఇవ్వడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. చేసేది లేక సర్దుకుపోతున్నట్లు విద్యార్థులు చెబుతున్నారు.