ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో 22 ఏళ్ల ఓ యువతి ఆత్మహత్యకు యత్నిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో పెట్టగా, మెటా ఏఐ యూపీ పోలీసులను అప్రమత్తం చేయడం ద్వారా ఆమె ప్రాణాలను కాపాడడంలో సాయపడింది. ఏఐ అందించిన అలర్ట్ ద్వారా 4 నిమిషాల్లోనే యువతి ఇంటికి చేరుకున్న సమీప పోలీస్ స్టేషన్ సిబ్బంది ఆమెను రక్షించారు. పెళ్లి అయిన 4 నెలల తర్వాత భర్త తనను అంగీకరించకపోవడంతో ఆత్మహత్యకు యత్నించానని సదరు యువతి తెలిపింది.