ముంబైకి రెడ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ

83చూసినవారు
ముంబైకి రెడ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ
ముంబైకి వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. విద్యాసంస్థలు ఇవాళ పాఠశాలలకు సెలవును ప్రకటించాయి. ఇవాళ మహారాష్ట్రలోని కొంకణ్‌లో అత్యంత భారీ వర్షపాతం కురవవచ్చునని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు రెడ్ అలర్ట్‌ను జారీ చేసింది. ముంబైలోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం ఈరోజు ఆర్థిక రాజధానికి రెడ్ అలర్ట్‌ను ప్రకటించింది. దీంతో పాటు థానే, పాల్ఘర్, పూణే, కొల్హాపూర్, సతారా, రాయ్‌గఢ్, రత్నగిరిలో ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్