విద్యుత్ సంక్షోభంపై కేంద్రానికి మంత్రి అతిషి లేఖ

69చూసినవారు
విద్యుత్ సంక్షోభంపై కేంద్రానికి మంత్రి అతిషి లేఖ
దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర విద్యుత్ సంక్షోభం నెలకొంది. నగరంలో పలు చోట్ల తీవ్ర విద్యుత్ అంతరాయంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో సోషల్ మీడియా వేదికగా కంప్లైంట్‌లు పెరిగిపోయాయి. అప్రమత్తమైన ఆప్ ప్రభుత్వం.. సమస్య పరిష్కారం కోసం కేంద్రానికి లేఖ పంపించింది. ఢిల్లీలో ఏర్పడిన విద్యుత్ సంక్షోభాన్ని వివరిస్తూ కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఖట్టర్‌కు ఆప్ మంత్రి అతిషి లేఖ రాశారు. తక్షణమే సమస్య పరిష్కరించాలని విన్నవించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్