రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు కుటుంబ సభ్యులను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పరామర్శించారు. మంగళవారం సాయంత్రం ఫిల్మ్‌సిటీలోని ఆయన నివాసానికి వచ్చి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. రామోజీరావు చిత్రపటం వద్ద నివాళులర్పి
ంచారు. రామోజీరావుతో తనకున్న అనుబంధాన్ని ‘ఈనాడు’ ఎండీ కిరణ్, మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్, రామోజీ ఫిల్మ్‌సిటీ ఎండీ విజయేశ్వరితో పంచుకున్నారు.