బంగారు నగలతో దొంగలు పరారీ.. అడ్డుకున్న పోలీస్(వీడియో)

78చూసినవారు
పశ్చిమబెంగాల్‌లోని రాణిగంజ్‌లో ఆదివారం షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ దొంగల ముఠా పట్టపగలు నగల దుకాణంలో చోరికి తెగబడింది. ఏడుగురు దొంగలు తుపాకులతో దుకాణంలోని సిబ్బందిని బెదిరించి రూ.4కోట్ల విలువైన నగలను సంచుల్లో వేసుకుని పారిపోయేందుకు ప్రయత్నించారు. అక్కడే ఉన్న మోండల్ అనే సబ్-ఇన్‌స్పెక్టర్ వారిని అడ్డుకునే ప్రయత్నం చేశాడు. దాంతో రూ.2.5కోట్ల విలువైన ఆభరణాలు అక్కడే వదిలి.. రూ.1.8 కోట్ల విలువైన ఆభరణాలతో పారిపోయారు. ఈ ఘటనకు చెందిన వీడియో నెట్టింట వైరలవుతోంది.

సంబంధిత పోస్ట్