కాసేపట్లో చంద్రబాబు, అమిత్‌షా భేటీ

51చూసినవారు
కాసేపట్లో చంద్రబాబు, అమిత్‌షా భేటీ
కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, చంద్రబాబు కాసేపట్లో భేటీ కానున్నారు. రాష్ట్ర మంత్రి వర్గంలోకి ఏయే బీజేపీ నేతలను తీసుకోవాలన్న దానిపై చర్చించనున్నారు. బీజేపీ నిర్ణయం వచ్చాక మంత్రి వర్గంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇవాళ అర్థరాత్రి తర్వాత గవర్నర్‌కు చంద్రబాబు మంత్రి వర్గ జాబితాను పంపనున్నారు. అమిత్‌షాతో భేటీ తర్వాత మంత్రులుగా ఎంపికైన వారికి చంద్రబాబు ఫోన్లు చేయనున్నారు. చంద్రబాబు పిలుపు కోసం ఇప్పటికే విజయవాడ, గుంటూరులో ఆశావహులు మకాం వేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్