ఉద్యోగులకు మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక సూచన

60చూసినవారు
ఉద్యోగులకు మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక సూచన
తెలంగాణ సచివాలయ ఉద్యోగులకు మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక సూచనలు చేశారు. సోమవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయ సంఘం ఆధ్వర్యంలో 2025 క్యాలెండర్‌ను ఎమ్మెల్సీ కోదండరాంతో కలిసి పొన్నం ప్రభాకర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఫైల్స్ విషయంలో ఉద్యోగులు నిర్లక్ష్యం, ఆలస్యం చేయకుండా ఉండటంతో పాటు ప్రభుత్వానికి మంచిపేరు తీసుకొచ్చేలా కృషి చేయాలని సూచించారు. ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకుని రావాలని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్