ఏజెన్సీ ప్రాంతాల్లో వైద్యం అందించండం కోసం బైక్ అంబులెన్సు ఎంతో ఉపయోగపడుతుందని మంత్రి సీతక్క అన్నారు. ఆదిలాబాద్ లో ఆమె మాట్లాడుతూ.. 'కంటైనర్ స్కూల్ మా ప్రాంతంలో ఏర్పాటు చేశాం. గ్రామీణ ప్రాంతంలో వైద్యులు రాక ఇబ్బంది పడుతున్నాం. రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు క్యాన్సిల్ చేసే దశలో ఉన్న వాటికి మేము జీవం పోశాం. కష్టమైనా ఇష్టంగా మలుచుకొని ట్రైబల్ ఏరియాలో పనిచేయండి. ముఖ్యంగా వైద్యులు ముందుకు వచ్చి గిరిజన గ్రామాల్లో సేవ చేయాలి' అని విజ్ఞప్తి చేశారు.