'రంగనాయక సాగర్' సాగు నీరు విడుదల చేసిన మంత్రి సురేఖ (వీడియో)

52చూసినవారు
కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో భాగమైన రంగనాయక సాగర్ ప్రాజెక్టు ద్వారా మంత్రి కొండా సురేఖ సాగు నీరు విడుదల చేశారు. శనివారం రంగనాయక సాగర్ ఎడమ కాలువ ద్వారా 1 లక్షా 10 వేల ఎకరాలకు మంత్రి సాగు నీరు విడుదల చేశారు. సాగర్ మొత్తం సామర్థ్యం 3 టీఎంసీలు కాగా ప్రస్తుతం ఇక్కడ 2.44 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు మంత్రి తెలిపారు. ఈ సాగర్ నుంచి విడుదలైన నీటి ద్వారా సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల జిల్లాలు ప్రయోజనం పొందుతాయని మంత్రి తెలిపారు.

సంబంధిత పోస్ట్