'నారాయణపూర్‌' పూర్తి చేస్తామని హామీ ఇస్తున్నా: మంత్రి ఉత్తమ్‌

54చూసినవారు
'నారాయణపూర్‌' పూర్తి చేస్తామని హామీ ఇస్తున్నా: మంత్రి ఉత్తమ్‌
తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు తీసుకొచ్చేలా చేయడమే తమ ప్రభుత్వ విధానమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. నారాయణపూర్‌ ప్రాజెక్టు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం రూ. లక్షల కోట్లు ఖర్చు చేసి నామమాత్రపు ఆయకట్టు నిర్మించిందన్నారు. ముంపు గ్రామాల ప్రజలకు సరైన న్యాయం చేస్తానని చెప్పారు. 4 పథకాలకు సంబంధించి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతుందని.. అర్హులైన ప్రతిఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందిస్తామని చెప్పారు.

సంబంధిత పోస్ట్