ఏపీలోని ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ పథకంపై ప్రభుత్వం ముందడుగు వేసింది. తాజాగా ఈ పథకంపై మంత్రుల కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఇప్పటికే ఈ పథకం అమల్లో ఉన్న ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం చేసి సిఫారసు చేయాలని ఈ కమిటీకి సూచించింది. రవాణాశాఖ మంత్రి ఎం. రామ్‌ప్రసాద్‌రెడ్డి సారథ్యంలో ఈ కమిటీ పనిచేయనుంది.