జార్ఖండ్‌లో దుండగులు రెచ్చిపోయారు. లాతేహర్‌లోని కుస్మాహి రైల్వే సైడింగ్ సమీపంలో ఆదివారం అర్థరాత్రి బోగ్గు లోడ్‌తో వెళుతున్న రెండు వాహనాలకు గుర్తుతెలియని దుండగులు నిప్పుపెట్టారు. అనంతరం ఓ డ్రైవర్ పారిపోతుండగా కాల్పులు జరిపారు. మరో డ్రైవర్‌పై దాడి చేసి ఫోన్‌ను లాక్కున్నారు. ఈ ఘటనలో రెండు వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దుండగుల కోసం గాలిస్తున్నారు.