ఒక కప్పు గోరు వెచ్చని నీటిలో పావు టీస్పూన్ పసుపు వేసి కలిపి అందులో కాస్త నిమ్మరసం, తేనె జోడించి తీసుకోవచ్చు. ఈ డ్రింక్‌ను ఉదయం లేదా రాత్రి నిద్రకు ముందు తాగవచ్చు. దీని వల్ల శరీర మెటబాలిజం పెరుగుతుంది. దీంతో క్యాలరీలు వేగంగా ఖర్చవుతాయి. ఫలితంగా కొవ్వు వేగంగా కరిగిపోతుంది. అధిక బరువు తగ్గుతారు. లివర్ క్లీన్ అవుతుంది. మూత్ర పిండాలు కూడా శుభ్రమవుతాయి. దీంతో రోగాల నుంచి రక్షణ లభిస్తుంది.