తెలంగాణలో నేడు, రేపు మోస్తరు వర్షాలు

112077చూసినవారు
తెలంగాణలో నేడు, రేపు మోస్తరు వర్షాలు
పశ్చిమ భారత ప్రాంతాల నుంచి తెలంగాణలోకి తక్కువ ఎత్తులో పవనాలు వీస్తున్నాయి. ఈ క్రమంలో ఆది, సోమవారాల్లో రాష్ట్రంలోని ఆయా ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు వర్షాలు కురిశాయి. అత్యధికంగా పెద్దపల్లి జిల్లాలోని ముత్తారంలో 4.3 సెంటీ మీటర్లు, సంగారెడ్డిలోని లక్ష్మీనగర్‌లో 3.8, ములుగులోని మల్లంపల్లిలో 3.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్