AP: నెల్లిమర్ల మిమ్స్ వైద్య విద్యార్థి సూసైడ్ నోట్ వైరల్ అవుతోంది. ‘అమ్మ, నాన్నా, తమ్ముడూ నన్ను క్షమించండి. పదేళ్లుగా మిమ్మల్ని చాలా కష్టపెట్టా. ఎంత కష్టపడి చదువుదామన్నా చదవలేక పోతున్నా. గత 8-9 నెలల నుంచి ఆత్మహత్య ఆలోచనలు తినేస్తున్నాయ్. నాకు నేనే పిచ్చోడిలా అనిపిస్తున్నా. బతకాలంటే భయమేస్తోందమ్మా. మీ ముగ్గురే నా జీవితం. ఇంకా ఎంత కాలం బాధ పెడతా. నన్ను క్షమించండి’ అని లేఖలో పేర్కొన్నాడు.