తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న చలి.. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

67చూసినవారు
తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న చలి.. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
తెలుగు రాష్ట్రాలను చలిపులి వణికిస్తోంది. తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణశాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇవాళ తెల్లవారుజామున ఆదిలాబాద్ జిల్లాలో కనిష్టంగా 9.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పటాన్ చెరులో 11, మెదక్ 13.3 డిగ్రీలు, రామగుండంలో 14.5, హన్మకొండలో 15 డిగ్రీలు, హైదరాబాద్ 15.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు ప్రకటించింది. అటు ఏపీలోని అరకులోయలో 5.9 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్