'రైతుబంధు' సాయం అందని రైతుల ఖాతాల్లోకి డబ్బులు

39601చూసినవారు
'రైతుబంధు' సాయం అందని రైతుల ఖాతాల్లోకి డబ్బులు
తెలంగాణలో రైతుబంధు సాయం కొంతమంది రైతులకు అందలేదు. ఈ క్రమంలో సాంకేతిక సమస్యలతో రైతుబంధు సాయం అందని వారికి తిరిగి ఖాతాల్లో నగదు జమ చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ తెలిపింది. నిర్వహణలో లేని బ్యాంక్ అకౌంట్ నంబర్, బ్యాంక్ ఖాతా క్లోజ్ కావడం, ఫ్రీజ్ అవడం వంటి కారణాలతో పలువురు రైతులకు సాయం అందలేదని వెల్లడించింది. బ్యాంకు అధికారులతో సంప్రదించి ఖాతా వివరాలు సరిచేసిన తర్వాత రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని పేర్కొంది.

సంబంధిత పోస్ట్