అంతర్జాతీయ ఐటీ దిగ్గజ సంస్థ యాక్సెంచర్, భారత్‌లో మరిన్ని నియామకాలు జరుపుతామని ప్రకటించింది. ముఖ్యంగా తాజా ఉత్తీర్ణులపై సంస్థ దృష్టి సారిస్తున్నట్లు కంపెనీ సీఈఓ జూలీ స్వీట్ వెల్లడించారు. ఎక్కువ భాగం భారత్‌లోనే ఉంటాయని అన్నారు. ‘డేటా, ఏఐ సిబ్బందిని స్థిరంగా పెంచుకుంటున్నాం. 2025-26 కల్లా 80,000 మందిని తీసుకోవాలన్న లక్ష్యంలో భాగంగా, ఇప్పటికే 57,000 ప్రాక్టిషనర్లను నియమించుకున్నామ’ని జూలీ పేర్కొన్నారు.