చిన్న వయసులోనే గుండెపోటుతో చనిపోతున్న వారి సంఖ్య ఇటీవల కాలంలో పెరుగుతోంది. ఇక కుమారుడి బర్త్ డే పార్టీలో తల్లి గుండెపోటుతో మృతి చెందిన గుజరాత్‌లోని వల్సాద్ జిల్లాలో తాజాగా జరిగింది. వాపి పట్టణంలోని ఓ హోటల్‌లో కుమారుడి 5వ పుట్టిన రోజు పార్టీని యామినీ దంపతులు ఘనంగా నిర్వహించారు. ఆ సమయంలో అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో యామినీ కుప్పకూలింది. కుమారుడి కళ్ల ముందే ఆమె ప్రాణాలు కోల్పోయింది.