తెలంగాణలో మరోమారు అధికార యంత్రాంగం భూదస్త్రాల ప్రక్షాళన చేపట్టనుంది. ప్రతి కమతానికి ‘భూధార్’ సంఖ్యను కేటాయించేందుకు దస్త్రాల పరిశీలన తప్పనిసరి కానుంది. రాష్ట్రంలో కొత్త ROR-2024 చట్టం తెచ్చేందుకు ఇటీవలే రెవెన్యూ శాఖ కార్యాచరణ ప్రారంభించి ముసాయిదా విడుదల చేసింది. ప్రజాభిప్రాయ సేకరణ అనంతరం చట్టాన్ని రూపొందించి అమల్లోకి తీసుకురానున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకంలో భాగంగా అన్ని రాష్ట్రాలు అమలుచేస్తున్న ఈ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా అమలు చేయనుంది.