అణగారిన వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలపై అప్పట్లో చాలా ఉద్యమాలు పుట్టుకొచ్చాయి. 1994లో మంద కృష్ణ మాదిగ.. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (MRPS)ని స్థాపించి.. మాదిగల హక్కుల పోరాటానికి నాంది పలికారు. బీసీల్లో ఉన్న ఏబీసీడీ వర్గీకరణ మాదిరిగానే ఎస్సీ కులాలను కూడా A,B,C,D గ్రూపులుగా వర్గీకరించాలంటూ పాదయాత్ర చేశారు. 1972 నుంచి మొదలుకుని మారిన ప్రతీ ముఖ్యమంత్రి వద్దకు వెళ్లి ఎస్సీ వర్గీకరణ చేయాలని కోరారు.