ముక్కోటి ఏకాదశికి పురాణాల్లో ప్రత్యేక స్థానం ఉంది. జనవరి 10న ముక్కోటి ఏకాదశి వస్తుండడంతో ఆ రోజున ఉత్తర ద్వారం గుండా వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే కోటి పుణ్యాల ఫలం లభిస్తుందని పండితుల అభిప్రాయం. ఇద్దరు రాక్షసులు తమని క్షమించి వైకుంఠ ప్రవేశం కల్పించాలని విష్ణుమూర్తిని కోరగా.. ఏకాదశి రోజున వైకుంఠ ద్వారం తెరిచి వారికి ముక్తిని ప్రసాదించాడని, అందుకే ఈ రోజుకు అంతటి ప్రాధాన్యత ఉందని పండితులు పేర్కొంటున్నారు.