‘నా పిల్లలు రెండ్రోజులుగా ఏం తినలేదు.. ఎలాగైనా మీ డబ్బులు మీకిచ్చేస్తా’

74చూసినవారు
AP: పల్నాడు జిల్లా దాచేపల్లి సచివాయంలో పనిచేస్తున్న ఉద్యోగి లక్ష్మీప్రసాద్ పెన్షన్‌ డబ్బులతో పరారైన విషయం తెలిసిందే. పోలీసులు, అధికారులు అతడిపై కేసు నమోదు చేసి విస్తృతంగా గాలిస్తున్నారు. తప్పించుకోలేనని భావించిన అతను తాజాగా సెల్ఫీ వీడియో విడుదల చేశాడు. ‘నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. నెలరోజులలో డబ్బులు చెల్లిస్తాను. ఆన్ లైన్ బెట్టింగులతో మోసపోయాను. నా కుటుంబం, పిల్లలు రెండు రోజులుగా ఏమీ తినలేదు’ అని లక్ష్మీప్రసాద్ ప్రాధేయపడ్డాడు.

సంబంధిత పోస్ట్