AP: రాష్ట్ర విద్యాశాఖ కీలక ప్రకటన చేసింది. రంజాన్ మాసం సందర్భంగా రాష్ట్రంలోని ఉర్ధూ పాఠశాలల పని వేళల్లో మార్పు చేసింది. ఈ నెల 3 నుంచి 30వ తేదీ వరకూ ఉర్ధూ పాఠశాలల పని వేళలు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1:30 గంటలకు మార్పు చేసినట్లు ప్రకటించింది. ఉర్ధూ మీడియం ప్రాథమిక పాఠశాలలు, ఉన్నత పాఠశాలలు, సమాంతర విభాగం, డైట్ కళాశాలల పని వేళల్లో మార్పు వర్తిస్తుందని తెలిపింది.