తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడి ప్రకటనపై ఎంపీ లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పదకొండు రాష్ట్రాల అధ్యక్షులను ప్రకటించామని.. త్వరలోనే అన్ని రాష్ట్రాలకు ప్రకటిస్తామని అన్నారు. మరో వారం, పది రోజుల్లో మన రాష్ట్ర అధ్యక్షుడి నియామకం పూర్తవుతుందన్నారు. దక్షిణాది వ్యక్తికి జాతీయ అధ్యక్ష పదవి అని ఎక్కడా చర్చ లేదని ఆయన లక్ష్మణ్ పేర్కొన్నారు.