సినీ నటుడు పోసాని కృష్ణమురళిని ఆదోనీ పోలీసులు పీటీ వారెంట్‌పై గుంటూరు జైలు నుంచి తరలిస్తుండడం పట్ల వైసీపీ నేత అంబటి రాంబాబు స్పందించారు. మూడ్రోజుల్లో మూడు పోలీస్ స్టేషన్లకు తిప్పడం పట్ల విచారం వ్యక్తం చేశారు. మంత్రి లోకేశ్, పోలీస్ వ్యవస్థ కలిసి 67 ఏళ్ల పోసానిని ఆ జైలుకు, ఈ జైలుకు తిప్పడం వేధించడమేనని విమర్శించారు. పోసాని ఏమైనా అంతర్జాతీయ నేరం చేశారా? అని ఈ సందర్బంగా ప్రశ్నించారు.