తన తండ్రి దాసరి హనుమయ్యపై ఆర్కేపురం బీజేపీ కార్పొరేటర్ ధీరజ్ రెడ్డి, ఆయన అనుచరులు హత్యాయత్నం చేశారని బీఆర్ఎస్ నాయకురాలు దాసరి ఉష ఆరోపించారు. 'మా నాన్నకు ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తానని బీజేపీ ఆఫీసుకు పిలిపించుకొని రక్తం వచ్చేలా కొట్టారు. తనని చంపవద్దని కాళ్లపై పడి ప్రాధేయపడేలా చేశారు. డబ్బులు అడిగితే ధీరజ్ రెడ్డి చంపుతానని బెదిరించి పంపారు.' అని ఉష అన్నారు. తన తండ్రి పరిస్థితి చూసి ఆమె కంటతడి పెట్టుకున్నారు.