జమ్ముకశ్మీర్‌లోని రాజౌరీ ప్రాంతంలో 45 రోజుల వ్యవధిలో 16 మంది అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. పీజీఐమర్ సంస్థ, ఎన్‌ఐవీ, ఎన్‌సీడీసీ వంటి వివిధ సంస్థలు ఇప్పటికే రంగంలోకి దిగినప్పటికీ మరణాలకు గల కారణం తెలియరాలేదు. ఇటీవల మరో మహిళ ఆస్పత్రిలో చేరడం వల్ల జిల్లా వైద్యాధికార యంత్రాంగం అప్రమత్తమైంది. అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం అన్ని కోణాల్లో దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది.