చిన్నారుల వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమ పరిశీలన
బిజినపల్లి మండలంలోని పాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో గల కారుకొండ, లింగసానిపల్లి, తాడూరు మండల పరిధిలోని పర్వతాయపల్లి ఆరోగ్య ఉప కేంద్రాలలో శనివారం చిన్నారులకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ద్వారా నిర్వహిస్తున్న వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని జిల్లా టీకాల అధికారి డాక్టర్ కే. రవికుమార్ నాయక్ పరిశీలించారు. ఆయన సిబ్బందికి పలు సూచనలు చేశారు. క్షేత్రస్థాయిలో పంపిణీ చేస్తున్న టీకాల నాణ్యతను పరిశీలించారు.