కల్వకుర్తి పట్టణాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తామని ప్రతివార్డుకు నిధులు కేటాయించి అభివృద్ధి పరచడమే ధ్యేయంగా ముందుకు సాగుతారని ప్రజలు ఈ విషయంలో ఇబ్బందులు పడకుండా ఉండాలని కల్వకుర్తి మాజీ సర్పంచ్ ఆనంద్ కుమార్ అన్నారు. అందులో భాగంగా శనివారం తిమ్మరాజుపల్లి గ్రామంలో నిర్మిస్తున్న సీసీ రోడ్లను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ కాంట్రాక్టర్ పనులను నాణ్యతతో పాటు సకాలంలో పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని అన్నారు.