కల్వకుర్తి అసెంబ్లీ ప్రజలు 70 సంవత్సరాలు నిండిన వారంతా భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని కల్వకుర్తి అసెంబ్లీ బీజేవైఎం కన్వీనర్ పద్మ అనిల్ ముదిరాజ్ ఆదివారం కోరారు. ప్రజల ఆరోగ్యం పట్ల ప్రధాని ఈ పథకాన్ని తీసుకువచ్చారని అన్నారు. ఈ పథకంలో 5 లక్షల వరకు ఉచిత ఆరోగ్య భీమా సౌకర్యం కల్పిస్తున్నారని అందరూ ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.