నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండలం చెన్నంపల్లి ప్రభుత్వ పాఠశాలకు విద్యుత్ ఫ్యాన్, విద్యుత్ వైరింగ్ పరికరాలను స్వామి వివేకానంద యువజన సంఘం సభ్యులు సోమవారం అందజేశారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఈ పరికరాలను అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం సతీష్ కుమార్, పోలా సాయి జ్యోతి, ఖదీర్ పాష, యువజన సంఘం సభ్యులు ఎం. భాస్కర్, జి. లింగస్వామి, జి. మల్లేష్, ఎస్. శ్రీశైలం, తదితరులు పాల్గొన్నారు.