కప్పదాటు నేతల తీరు....... ఔరా అంటున్న ఓటర్

2317చూసినవారు
కప్పదాటు నేతల తీరు....... ఔరా అంటున్న ఓటర్
రాజకీయాలలో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు అనే నానుడి ప్రచారంలో ఉంది. నిన్న మొన్నటి వరకు ఆ పార్టీ మీద ఆరోపణలు ఆ పార్టీ నాయకులను మీద కారాలు మిరియాలు నూరి నేడు అదే పార్టీలోకి వెళ్లడంతో సామాన్య ప్రజానీకం నేటి రాజకీయ నాయకుల తీరు చూసి ఔరా అంటూ నోరెళ్ళబెడుతున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో నిన్న మొన్నటి వరకు బిఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులు సొంత పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రస్తుత పరిణామాలతో ఏ నాయకుడు ఏ పార్టీలో ఉంటాడో లేదో తెలియక సామాన్య ఓటర్ ఆశ్చర్యపోతున్నారు.

సంబంధిత పోస్ట్