వంగూర్: కుటుంబ సర్వేకు ప్రజలు సహకరించాలి
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కుటుంబ సమగ్ర సర్వేను విజయవంతం చెయ్యాలని రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యులు కేవీయన్ రెడ్డి అన్నారు. బుధవారం వంగూర్ మండల కేంద్రంలోని శ్రీ గెల్వాలంబమాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇంటింటి, కుటుంబ సర్వే లో కెవిఎన్ రెడ్డి, పాల్గొని ప్రజలకు సర్వే యొక్క విధి విధానాలను వివరించారు.