తిప్పారెడ్డిపల్లిలో ఆరోగ్య శిబిరం ఏర్పాటు
నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండలం పరిధిలోని తిప్పారెడ్డిపల్లి గ్రామంలో మంగళవారం వంగూరు ప్రభుత్వ ఆసుపత్రి ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని నిర్వహించారు. సీజనల్ వ్యాధులకు చికిత్స, మందులను అందించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ మేషక్, ఆశా కార్యకర్తలు లక్ష్మమ్మ, సూర్య కళ, ముస్తఫా, కాశమ్మ, గ్రామపంచాయతీ కార్యదర్శి, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.